'తెలుగుదేశం సమస్యలను అవకాశాలుగా మలచుకునే పార్టీ - సమస్యలకు భయపడే పార్టీ కాదు' - TDP Leaders comments
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 11, 2023, 10:43 PM IST
|Updated : Nov 12, 2023, 6:39 AM IST
Payyavula Keshav on Telugu Desam Party: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మద్దతుగా అనంతపురం జిల్లాలో వృత్తినిపుణుల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా టీడీపీ నేతలు పయ్యావుల కేశవ్, కాలవ శ్రీనివాసులు విచ్చేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీ సమస్యలను అవకాశాలుగా మలచుకునే పార్టీ తప్పా, సమస్యలకు భయపడే పార్టీ కాదని తెలియజేశారు. 2024లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబును సీఎంను చేసి.. రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా అందరూ కృషి చేయాలని నేతలు పిలుపునిచ్చారు.
TDP Leaders Comments: వృత్తినిపుణుల ఆధ్వర్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతుగా అనంతపురంలో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో పాల్గొన్న వివిధ రంగాల నిపుణులు.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమలు చేసిన పథకాలు, అభివృద్ధి, ప్రాజెక్టులు, టెక్నాలజీలపై సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు పయ్యావుల కేశవ్, కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ..''తెలుగుదేశం సమస్యలను అవకాశాలుగా మలచుకునే పార్టీ..సమస్యలకు బయపడే పార్టీ కాదు. చంద్రబాబు హయాంలో ఏపీ అభివృద్ధి కేంద్రంగా ఉండేది. సీఎం జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ బిహార్‌ను తలపిస్తోంది. చంద్రబాబును సీఎం చేసి పూర్వ వైభవం తీసుకురావడమే మనందరి లక్ష్యం'' అని వారు పిలుపునిచ్చారు.