Pawan meeting With Janasena Representatives: ప్రభుత్వ విధానాల్లోని లోపాలు, వైఫల్యాలపై సమర్థంగా మాట్లాడాలి: పవన్
🎬 Watch Now: Feature Video
Pawan Meet Meeting Janasena Representatives: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఆ పార్టీ అధికార ప్రతినిధులతో సమావేశమయ్యారు. సమావేశంలో పలు కీలక విషయాలపై సుదీర్ఘంగా చర్చించిన పవన్.. జనసేన తరపున టీవీ చర్చలు, మీడియా సమావేశాలు, సోషల్ మీడియా ప్రచారంపై దిశానిర్దేశం చేశారు.
Pawan Kalyan Comments: జనసేన అధికార ప్రతినిధులతో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..''టీవీ చర్చలు, మీడియా సమావేశాల్లో పాల్గొనే నాయకులు పార్టీ విధానాలకు కట్టుబడి ఉండాలి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార ప్రతినిధులపై గురుతర బాధ్యత ఉంది. అదే సమయంలో వ్యక్తిగత అభిప్రాయాలు, దూషణలకు తావు లేదు. ప్రజా సమస్యలపై నిరంతర అధ్యయనం చేయాలి. పాలకుల విధానాల్లో లోపాలు, వైఫల్యాలపై సమర్థంగా మాట్లాడాలి. కులాలు, మతాల గురించి మాట్లాడే సమయంలో ఆచితూచి ఉండాలి. ఎవరి మనోభావాల్ని దెబ్బతినేలా మాట్లడవద్దు. వ్యక్తిగత విషయాలు, శరీరాకృతి, వస్త్రధారణ గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దు. కులాలు, మతాలు గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు రాజ్యాంగంలోని రూల్ ఆఫ్ లా పరిధిలోనే ఉండాలి. అన్ని మతాలను ఒకేలా గౌరవించాలి. ఎవరిపై దాడి జరిగినా గట్టిగానే నిలదీయాలి. నా సినిమాలు, కుటుంబ సభ్యులపై వచ్చే విమర్శలపై కూడా ఎవరు స్పందించవద్దు. నేను జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తానని ఎప్పడూ చెప్పలేదు. ఓట్లను నోట్లతో కొనే వ్యవస్థను మార్చాలనేదే నా విధానం.'' అని పవన్ కల్యాణ్ అన్నారు.