Pawan Kalyan Varahi Yatra Schedule అక్టోబర్ 1 నుంచి పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ప్రారంభం.. కృష్ణా జిల్లా పర్యటన వివరాలు వెల్లడి - Pawan Kalyan Fourth Phase Varahi Yatra news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 29, 2023, 9:45 PM IST
Pawan Kalyan Varahi Yatra Schedule జనసేన అధినేత పవన్ కల్యాణ్ నాలుగో విడత వారాహి విజయ యాత్రకు సంబంధించి.. ఆ పార్టీ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కీలక విషయాలను వెల్లడించారు. ఎల్లుండి (అక్టోబర్ 1) నుంచి కృష్ణా జిల్లాలో పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర ప్రారంభంకాబోతుందని తెలిపారు.
Nadendla Manohar comments: పవన్ కల్యాణ్ నాల్గవ వారాహి విజయ యాత్ర షెడ్యూల్‌ను నాదెండ్ల మనోహర్ విడుదల చేశారు.'' అక్టోబర్ 1వ తేదీ నుంచి కృష్ణా జిల్లాలో పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ప్రారంభం కాబోతుంది. ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటలకు అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బహిరంగ సభ జరుగుతుంది. ఇప్పటికే మూడు దశలుగా పూర్తి చేసుకున్న పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర.. నాలుగో దశగా అవనిగడ్డ నుంచి ప్రారంభం కాబోతుంది. ఐదు రోజుల పాటు కృష్ణా జిల్లాలో ఈ యాత్ర సాగనుంది. అవనిగడ్డ బహిరంగ సభ అనంతరం పవన్‌కల్యాణ్ మచిలీపట్నం చేరుకుంటారు. 2, 3 తేదీల్లో మచిలీపట్నంలోనే ఉండి.. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రెండో తేదీన కృష్ణా జిల్లా జనసేన నాయకులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమవుతారు. మూడో తేదీ జనవాణి కార్యక్రమంలో ప్రజా సమస్యలపై అర్జీలు స్వీకరిస్తారు. నాలుగో తేదీ పెడన, ఐదో తేదీ కైకలూరు నియోజకవర్గాల్లో పర్యటిస్తారు.'' అని ఆయన నాదెండ్ల మనోహర్ తెలిపారు.