Pantham Satyanarayana Charitable Trust: ఘనంగా పంతం సత్యనారాయణ ఛారిటబుల్ ట్రస్ట్ 11వ వార్షికోత్సవం - రాజమహేంద్రవరం లేటెస్ట్ న్యూస్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 23, 2023, 11:32 AM IST

Pantham Satyanarayana Charitable Trust 11th Anniversary: తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరంలో పంతం సత్యనారాయణ ఛారిటబుల్ ట్రస్ట్ 11వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ట్రస్ట్ చైర్మన్, ట్రిపుల్ సీ ఛానల్ ఎండీ పంతం కొండలరావు ఆధ్వర్యంలో ఆనంద్ ఏజెన్సీ పందిరి హాలులో ఈ వేడుకను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ భరత్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, జనసేన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేశ్​ హాజరయ్యారు. పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు, మూగజీవాలకు నీరు, ఆహారం పంపిణీ, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తూ పంతం కొండలరావు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారని వారంతా కొనియాడారు. ఈ నేపథ్యంలోనే కోవిడ్ సమయంలో విశేష సేవలు అందించిన ప్రముఖుల్ని పంతం సత్యనారాయణ సన్మానించారు. అనంతరం ట్రస్ట్‌ సేవల్ని వివరించడంతో పాటు ఈటీవీ విన్ యాప్‌ని అందరూ మొబైల్ ఫోన్లలో డౌన్ లోడ్ చేసుకొని.. వినియోగించుకోవాలని ఆయన కోరారు. 

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.