Paderu MLA Faced Protest From YSRCP Leaders: వైసీపీ ఎమ్మెల్యేకు షాకిచ్చిన సొంత పార్టీ నేతలు.. జీఓ నెం.3 పై ఎవరూ సంతకం పెట్టమన్నారంటూ నిలదీత - పాడేరు ఎమ్మెల్యేకు నిరసన సెగ
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 25, 2023, 8:44 PM IST
Paderu MLA Faced Protest From YSRCP Leaders : అల్లూరి జిల్లాలో పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మికి స్వంత పార్టీ నుంచి నిరసన సెగ తగిలింది. జీఓ నెంబర్ 3 పై సొంత పార్టీ నేతలే నిలదీశారు. జిల్లాలోని మాడుగుల మండలం పులుసుమామిడి పంచాయతీ పరిధిలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ క్రమంలో జీఓ నెంబర్‌పై వైసీపీ మద్దతుదారుడైన పులుసుమామిడి గ్రామ వార్డు సభ్యుడితోపాటు, గ్రామస్థులు ఎమ్మెల్యేను నిలదీశారు. ఓట్లు వేయమని అభ్యర్థించిన వారి వద్ద మోహం చూపెట్టుకోలేకపోతున్నామని ఆయన అవేదన వ్యక్తం చేశారు. జీఓ నెంబర్3 పై ఎలా సంతకం చేశారని ప్రశ్నించగా.. సమాధానమివ్వకుండా అతడ్ని నీది ఏ పార్టీ, ఏ ఊరని ఎమ్మెల్యే తిరిగి ప్రశ్నించారు. దీంతో నాది వైసీపీ పార్టీనే, తోకగరువు గ్రామమని బదులు ఇచ్చారు. జీఓ నెంబర్ 3 ని ఎవరూ రద్దు చేశారో సమాధానమివ్వాలని ప్రశ్నించిన వైసీపీ నేతలపై ఎమ్మెల్యే ప్రశ్నల వర్షం కురిపించారు. మీరు తెలిసి తెలియకుండా అడుగుతున్నారని.. జీఓ నెంబర్ 3 కేవలం గిరిజనులకు వంద శాతం ఉపాదిని కల్పించేదని చెప్పారు.