సమస్యలు పరిష్కరించే వరకు పోరాడుతూనే ఉంటాం: ఏపీ జేఏసీ అమరావతి నేతలు - ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 28, 2023, 6:12 PM IST
Outsourcing Employees Meeting with AP JAC Amaravati Leaders: ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని.. ఏపీ జేఏసీ అమరావతి నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతపురంలోని రెవెన్యూ భవన్లో ఏపీ జేఏసీ అమరావతి నాయకులతో కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అంతకముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చాలీ చాలనీ వేతనాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారని ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రమకు తగిన వేతనం అందడం లేదన్నారు. ఉద్యోగ భద్రత లేదని.. ప్రభుత్వ పథకాలను తొలగించారని అన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులు గుర్తించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు పోరాడుతూనే ఉంటామని హెచ్చరించారు. డిసెంబర్ 10వ తేదీన విజయవాడలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు గుర్తు చేశారు. ఈ సభకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి హాజరవుతున్నారని తెలిపారు.