Outsourcing Employees Chalo Vijayawada Program: '4 ఏళ్లు గడిచింది.. క్రమబద్ధీకరిస్తామన్న హామీ ఎప్పుడు నెరవేరుస్తారు సీఎం గారూ..' - ఏపీలో కాంట్రాక్ట్ అవుట్ సోర్స్ ఉద్యోగుల ఆందోళన
🎬 Watch Now: Feature Video
Chalo Vijayawada Program of Outsourcing Employees: ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరిస్తామన్న సీఎం జగన్ హామీని అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్స్ ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు ఛలో విజయవాడ కార్యక్రమం చేపట్టారు. 2014 జూన్ నాటికి పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను మాత్రమే రెగ్యులరైజ్ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని కోరారు. 2014 జూన్ నాటికి పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్స్ ఉద్యోగులను మాత్రమే రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించడం సరికాదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలలో కాంట్రాక్టర్లు లేని వ్యవస్థను ఏర్పాటు చేస్తామని జగన్ హామీ ఇచ్చి 4 ఏళ్లు గడిచిందని ఆరోపించారు. అయినా సీఎం జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. విద్యుత్, ఆర్టీసీ, టీటీడీ... వంటి సంస్థల్లో దశాబ్దాలుగా ఉద్యోగులు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా పని చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పష్టమైన ఉత్తర్వులిచ్చి ఆయా సంస్థల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్స్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలన్నారు.