ఎలాంటి పరిస్ధితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం: నేవీ
🎬 Watch Now: Feature Video
Navy Rescue Teams Ready For Michaung Cyclone Operations: తుపాను ముంచుకొస్తున్న వేళ నౌకాదళం అప్రమత్తమైంది. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు నేవీ తమ బృందాలను రంగంలోకి దింపింది. ఏపీ, తమిళనాడు ప్రభుత్వాలతో నిత్యం సమీక్షిస్తున్నట్లు తూర్పు నౌకాదళ ప్రధానాధికారి, వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ తెలిపారు. ఆయా ప్రభుత్వాలతో మాట్లాడినట్లు రాజేష్ పెంధార్కర్ వెల్లడించారు. ఎటువంటి పరిస్ధితినైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నట్లు పేర్కొన్నారు. మానవీయ సాయం అందించేందుకు సన్నద్దంగా ఉన్నట్టు వెల్లడించారు. ఐదు పెద్ద యుద్ద నౌకల్లో సహాయ సామగ్రి, మందులను సిద్దంగా ఉంచినట్లు రాజేష్ పెంధార్కర్ తెలిపారు.
మానవీయ సహాయ చర్యల కోసం అవసరమైన నిత్యావసరాలు సిద్దం చేసినట్లు వెల్లడించారు. అతి తక్కువ సమయంలో ఇవి ఎక్కడికి అవసరమైతే అక్కడికి చేరుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సహాయ కార్యక్రమాల్లో నేవీ బృందాలు పాల్గొనేందుకు సిద్దంగా ఉంచామన్నారు. ఇప్పటికే ఒక యుద్ద నౌక సముద్రంలో సురక్షితమైన ప్రదేశంలో ఉందని తెలిపారు. తుపాన్ పరిస్దితిని నౌక ప్రత్యక్షంగా పరిశీలిస్తోందన్నారు.