Navratri festivities at Vijayawada Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారు.. పట్టు వస్త్రాలను సమర్పించనున్న సీఎం - సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 20, 2023, 2:04 PM IST

Navratri festivities at Vijayawada Indrakeeladri: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. మూలానక్షత్రం సందర్భంగా కనకదుర్గ అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు అభయమిచ్చారు. అర్ధరాత్రి 11గంటల నుంచే భక్తులు క్యూలో బారులు తీరారు. భక్తులు అధిక సంఖ్యలో వస్తారనే అంచనాతో అర్ధరాత్రి ఒకటిన్నర నుంచి దర్శనానికి అనుమతి కల్పించారు. దుర్గమాతను సీపీ కాంతిరాణా, ఎంపీ కేశినేని నాని దర్శించుకున్నారు. దీంతో పాటు కుమ్మరిపాలెం, వినాయక ఆలయం వద్ద క్యూలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. భక్తుల రద్దీ దృష్ట్యా వీఐపీ దర్శనాలను అధికారులు రద్దుచేశారు. కొండపైకి, ఆలయ పరిసరాల్లోకి వాహనాలు రాకుండా పోలీసులు నిరాకరించారు. దీంతో పాటు విధులకు వెళ్లేవారిని కూడా పోలీసులు నిలువరిస్తుండటంతో స్థానికులు అసహనం వ్యక్తం చేశారు.

అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నా సీఎం జగన్  దసరా శరన్నవరాత్రి సందర్భంగా.. ముఖ్యమంత్రి జగన్‌ రాష్ట్ర ప్రభుత్వం తరఫున.. పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. పర్యటన అనంతరం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భద్రత చర్యలపై జిల్లా అధికార యంత్రాంగం.. వివిధ శాఖల అధికారులతో కలిసి ఇంద్రకీలాద్రిని పరిశీలించింది. పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా ట్రాఫిక్ నియంత్రణ చర్యలను పరిశీలించి.. తదుపరి ఏర్పాట్లను అధికారులకు వివరించారు. ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా.. భక్తులకు అసౌకర్యం కలగకుండా.. ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది సమక్షంలో అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ నిర్వహించారు. సీఎం కాన్వాయ్ దిగిన నుంచి ఇంద్రకీలాద్రి పైకి సాఫీగా చేరుకునేలా ట్రయల్ రన్ నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.