నవంబర్ 27 నుంచి యువగళం పాదయాత్రకు సిద్దమవుతున్న నారా లోకేశ్ - ఎక్కడినుంచంటే?

🎬 Watch Now: Feature Video

thumbnail

Nara Lokesh Yuvagalam Padayatra Update: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 'యువగళం' పాదయాత్రకు సంబంధించి.. ఆ పార్టీ నేతలు కీలక విషయాలను వెల్లడించారు. ఈ నెల (నవంబర్) 27వ తేదీ నుంచి యువగళం పాదయాత్ర ప్రారంభమౌతుందని పేర్కొన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలం పొదలాడ నుంచి నారా లోకేశ్ పాదయాత్ర మొదలవుతుందని, 18 రోజుల పాటు కొనసాగే ఈ యాత్రను పార్టీ శ్రేణులు, ప్రజలు, యువత విజయవంతం చేయాలని టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. 

Yuvagalam Padayatra Starts on 27th November: నవంబర్ 27 నుంచి 'యువగళం' పాదయాత్ర మళ్లీ ప్రారంభం కానుంది. డిసెంబరు నెలాఖరు వరకు సాగే ఈ పాదయాత్ర విశాఖపట్నంలో ముగియనుంది. టీడీపీ అధినేత చంద్రబాబును సెప్టెంబరు 9న సీఐడీ పోలీసులు అరెస్టు చేయడంతో..నారా లోకేశ్‌ పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. తాజాగా నైపుణ్యాభివృద్ధి కేసులో చంద్రబాబుకు పూర్తిస్థాయి బెయిలు లభించడంతో మళ్లీ పాదయాత్రను కొనసాగించేందుకు లోకేశ్‌ సిద్ధమయ్యారు. సెప్టెంబరు 9న కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని పొదలాడలో లోకేశ్‌ పాదయాత్రకు విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. అక్కడి నుంచే ఈ నెల 27 నుంచి తిరిగి పాదయాత్రను ప్రారంభించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.