మూడు నెలల్లో ప్రజా ప్రభుత్వం వస్తుంది - మీ అందరి కన్నీళ్లు తుడుస్తాం : నారా లోకేశ్ - నారా లోకేశ్ వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 13, 2023, 1:49 PM IST

Nara Lokesh Yuvagalam Padayatra : అనకాపల్లి జిల్లాలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ యువగళం పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. 221వ రోజు అనకాపల్లి జిల్లా నక్కపల్లి కృష్ణగోకులం లేఔట్‌ నుంచి యాత్రను ప్రారంభించిన లోకేెెశ్​కు యువకులు, మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. స్థానికులు తమ సమస్యలపై యువనేతకు వినతి పత్రాలు అందజేశారు. 3 నెలల్లో ప్రజా ప్రభుత్వం వస్తుందని, అనంతరం సమస్యలు పరిష్కరిస్తామని లోకేశ్‌ వారికి భరోసాను ఇచ్చారు.

TDP Leader lokesh Padayatra 221th Day Schedule : మధ్యాహ్నం పెనుగొల్లులో బీసీ సామాజికవర్గం ప్రతినిధులతో నారా లోకేశ్ ముఖాముఖి కానున్నారు. భోజన విరామం అనంతరం పెనుగొల్లులో షుగర్ ఫ్యాక్టరీ కార్మికులతో ముఖాముఖి, సాయంత్రం పెనుగొల్లు నుంచి యువగళం పాదయాత్ర కొనసాగిస్తారు. పాదయాత్ర పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం యలమంచిలి నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. పాలపర్తిలో స్థానికులతో సమావేశం, లక్కవరంలో ములకలపల్లిలో రైతులతో, ములకలపల్లిలో యువతతో సమావేశం కానున్నారు. పోతిరెడ్డిపాలెంలో స్థానికులతో సమావేశం అనంతరం రేగుపాలెం జంక్షన్​లో స్థానికులతో సమావేశమై వారి సమస్యలను తెలుకుంటారు. కొత్తూరు ఎస్​వి కన్వెన్షన్ సెంటర్ వద్ద విడిది కేంద్రంలో లోకేశ్ బస చేస్తారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.