Nara Lokesh Selfi Challenge to CM Jagan: "సీఎం జగన్ ఏ విధ్వంసంతో పాలన ప్రారంభించారో.. అక్కడి నుంచే పతనం ప్రారంభం కాబోతుంది" - Lokesh latest News
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/19-08-2023/640-480-19306249-thumbnail-16x9-nara-lokesh-selfi.jpg)
Nara Lokesh Selfi Challenge to CM Jagan: జగన్ సైకోయిజానికి ప్రత్యక్షసాక్ష్యం ఉండవల్లిలోని ప్రజావేదిక అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ప్రజావేదిక శిథిలాల వద్ద సెల్ఫీ తీసుకుని మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన తొలిరోజుల్లో మొదలైన కూల్చివేతల పర్వం.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉందని మండిపడ్డారు. వైసీపీ రాక్షస పాలనలో గూడు కోల్పోయిన లక్షలాది పేదల కన్నీళ్లు మండుతున్నాయని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సీఎం జగన్ ఏ విధ్వంసంతో పాలన ప్రారంభించారో.. అక్కడి నుంచే పతనం ప్రారంభం కాబోతుందని తెలిపారు. లోకేశ్ యువగళం పాదయాత్ర ఉండవల్లి నుంచి ప్రారంభం కాగా.. కొండవీటి వాగు వద్ద బోట్ అసోసియేషన్ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. వైసీపీ ప్రభుత్వంలో వారు నష్టపోయిన తీరును లోకేశ్‌కు వివరించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. వారికి పూర్వవైభవం తీసుకురావాలని లోకేశ్‌ను వారు కోరారు. అంతేకాకుండా కృష్ణా నదిలో పడవల ప్రదర్శన చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం నిర్వాకం వల్ల వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయని బోట్ అసోసియేషన్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.