మూణ్ణెళ్ల ముచ్చట కోసం వేల కోట్లు తగలేస్తావా జగన్? - విశాఖను విధ్వంసం చేసి ఏం సాధిస్తావ్ : నారా లోకేశ్ - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 24, 2023, 1:41 PM IST
Nara Lokesh Fires On CM Jagan : కోర్టు ఆదేశాలున్నా దొడ్డిదారిన ప్రభుత్వ కార్యాలయాల్ని తరలించేందుకు జగన్ జీవోలు జారీచేయిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మండిపడ్డారు. అమరావతిలో సచివాలయం టీడీపీ ప్రభుత్వం కట్టిందని అన్నారు. అందులో కూర్చుని ఇదేం రాజధాని అంటూ వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో ఐటీ డెవలప్మెంట్ కోసం తెలుగుదేశం సర్కారు కట్టిన మిలీనియం టవర్స్‌ని ఖాళీ చేయిస్తున్నారని పేర్కొన్నారు. దీని కారణంగా వేల కోట్ల ఆదాయం తెచ్చిపెట్టే కంపెనీలని పక్క రాష్ట్రాలకి తరిమేస్తున్నదని లోకేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ధ్వజమెత్తారు.
Nara Lokesh Comments ON YCP Government : ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రుషికొండ, కైలాసగిరిని నాశనం చేసి, విశాఖని విధ్వంసం చేసి ఆ శిథిలాలపై కూర్చుని ఏం చేస్తావు జగన్..? అని లోకేశ్ నిలదీశారు. ఇంతా చేస్తే నీ పాలన ఎక్స్పైరీ డేట్ 3 నెలలని గుర్తు చేశారు. 3నెలల ముచ్చట కోసం వేల కోట్లు ప్రజల సొమ్ము తగలేస్తున్నావంటే జగన్‌ను సైకో అనే అనాలని లోకేశ్ అన్నారు.