NTR Letter Drawing: చిత్రం భళారే..! అన్న గారి సినీ, జీవిత విశేషాలతో అక్షర నివాళి.. - artist chintapalli kotesh
🎬 Watch Now: Feature Video
NTR Letter Drawing: ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ చిత్రాన్ని ఓ కళాకారుడు విభిన్నంగా ఆవిష్కరించాడు. నంద్యాలకు చెందిన చిత్రకారుడు చింతపల్లె కోటేశ్.. నందమూరి తారక రామారావు నటించిన 302 చిత్రాల పేర్లు, ఎన్టీఆర్ జీవిత విశేషాలతో ఆ మహనీయుడి చిత్రాన్ని గీశారు. విద్యాభ్యాసం, సినీ, రాజకీయ జీవితంలోని విశేషాలతో దీనిని తయారుచేసినట్లు కోటేశ్ చెప్పారు. అన్నదాత వేషధారణలో రామారావును చూపిస్తూ గీసిన ఈ చిత్రాన్ని ఏ3 డ్రాయింగ్ షీట్‌పై తీర్చిదిద్దారు.
ఈ చిత్రాన్ని వేసేందుకు మూడు గంటల సమయం పట్టినట్లు చిత్రకారుడు కోటేశ్ తెలిపారు. ఎన్టీఆర్‌కు ఉన్న కోట్లాది మంది అభిమానులలో తాను కూడా ఒకడిని అని ఆయన చెప్తున్నారు. ఎన్టీఆర్‌పై అభిమానంతో అక్షర చిత్ర నివాళి అర్పిస్తున్నట్లు కోటేశ్ అన్నారు. ఎన్టీఆర్‌కు ఉన్న కోట్లాది మంది అభిమానులలో తాను కూడా ఒకడిని అని ఆయన చెప్తున్నారు. ఆయన మీద అభిమానంతోనే చిత్రం గీసినట్లు చెప్పారు. గతంలో కూడా పలు చిత్రాలు గీసినట్లు పేర్కొన్నారు.