NTR FilmSeries at NewYork TimeSquare: అగ్రరాజ్యాన.. "న్యూయార్క్ టైం స్క్వేర్"పై అన్నగారి చిత్రమాలికలు - NTR centenary celebrations in New York
🎬 Watch Now: Feature Video
NTR Photo Gallary At New York Time Square: యుగపురుడు నందమూరి తారక రామారావు శత జయంతి వేళ... ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నారు. దీనిలో భాగంగానే ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యాన అమెరికాలో ఆ మహనీయుడికి శతజయంతి సందర్భంగా నీరాజనాలు అర్పిస్తున్నారు. నటరత్న విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు విజయ, సుందర దరహాసం. మొట్టమొదటిసారిగా ప్రఖ్యాత "న్యూయార్క్ టైం స్క్వేర్"పై ఎన్టీఆర్ చిత్రమాలికలను ప్రదర్శిస్తున్నారు. 200 అడుగులు ఎత్తు, 36 అడుగుల వెడల్పుతో ఉండే ఆయన చిత్రమాలికలను... అమెరికా కాలమానం ప్రకారం మే 27వ తేదీ అర్ధరాత్రి నుంచి మే 28 అర్ధరాత్రి వరకు 24 గంటల పాటు ప్రతి 4 నిమిషాలకు ఒకసారి 15 సెకన్ల పాటు ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా టైంస్క్వేర్ వద్దకు భారీ ఎత్తున చేరిన తెలుగుదేశం పార్టీ నాయకులు, సానుభూతిపరులు, అన్నగారి అభిమానులు... జై ఎన్టీఆర్.. జై జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు.