ఎన్టీఆర్ జిల్లాలో ప్రమాదకరంగా కాజ్వే - ఎప్పుడు, ఏం జరుగుతుందోనని ప్రయాణికుల ఆందోళన
🎬 Watch Now: Feature Video
Nallavagu low level Kalvert Damaged at Nandigama: ఎన్టీఆర్ జిల్లా నందిగామ శివారులో చందర్లపాడు మార్గంలోని నల్లవాగుపై కాజ్వే కుంగిపోయింది. దీంతో అటువైపుగా రాకపోకలు సాగించే ప్రయాణికులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కాజ్వే కుంగిపోవడంతో ఎటువంటి ప్రమాదం చోటుచేసుకుంటోదనని వాహనాదారులు ఆందోళన చెందుతున్నారు. నందిగామ నుంచి చందర్లపాడు వెళ్లే ఈ మార్గంలో ఇదే ప్రధాన రహదారి కావడంతో వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉంటుంది. కుంగిపోయిన కాజ్వే ప్రమాదకరంగా మారడంతో ఏ సమయంలోనైనా బ్రిడ్జి కూలిపోయే అవకాశం ఉంది.
మొదట కొద్ది మొత్తంలో కుంగిపోయిన కాజ్వే ప్రస్తుతం సగం రోడ్డు వరకు కుంగిపోయింది. ఇంతటి ప్రధానమైన రాహదారిపై ఉన్న లో లెవెల్ కాజ్వే కుంగిపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఆర్ అండ్ బీ అధికారులు నిధులు మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపినా, ఏళ్లు గడుస్తున్న నిధులు మంజూరు చేయడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం నిధులు మంజూరు చేసి లో లెవెల్ కాజ్వే స్థానంలో హై లెవల్ వంతెన నిర్మించాలని ప్రయాణికులు కోరుతున్నారు.