'వైఎస్సార్సీపీ పాలనలో విద్యావిధానం అస్తవ్యస్తం - విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దు' - నాదెండ్ల మనోహర్ వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 14, 2023, 2:58 PM IST

Nadendla Manohar Fire on YSRCP Government : విద్యాశాఖపై వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి సరైన అవగాహన లేకపోవడం వల్ల దాదాపు 85 వేల మంది విద్యార్థులు పరీక్ష రాయలేకపోతున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చెప్పారు. విద్యాశాఖలో CBSE (Central Board of Secondary Education) విధానాన్ని ప్రవేశపెడుతున్నామని గొప్పగా చెబుతున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. 

YSRCP Government Failed in AP Education System : రాష్ట్రంలో 44 వేల పాఠశాలలకుగాను కేవలం 1000 పాఠశాలల్లోనే సీబీఎస్ఈ విధానాన్ని అమలు చేస్తున్నారని నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ వెయ్యి పాఠశాలల్లోనూ మౌలిక సదుపాయాలు లేక ఈ ఏడాది పరీక్ష రాయలేకపోతున్నారని ఆరోపించారు. పాఠశాలల్లో కంప్యూటర్, సైన్స్ ప్రయోగశాలలు, గ్రంథాలయాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల విద్యార్థులు పరీక్షకు దూరమవుతున్నారని చెప్పారు. ఫీజు రూపంలో ఒక్క విద్యార్థి నుంచి వసూలు చేసిన 300 రూపాయలు ఏమయ్యాయని ప్రశ్నించారు. పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని, వారి భవిష్యత్తుతో చెలగాటమాడవద్దని ఆయన కోరారు. పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టులను ఇంతవరకు భర్తీ చేయలేదని మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.