"రెండోసారి జగన్​ సీఎం అయితే రాష్ట్ర భవిష్యత్తు శూన్యం" - Former legislators criticize Shah Jahans YCP

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 26, 2023, 9:53 PM IST

Updated : Nov 26, 2023, 10:54 PM IST

Muslim Minorities Meeting in Kurnool: ముస్లింలకు టీడీపీ ప్రభుత్వంతోనే న్యాయం జరుగుతుందని మాజీ శాసనమండలి ఛైర్మన్ ఎం.ఏ షరీఫ్ అన్నారు. కర్నూలులో నిర్వహించిన ముస్లిం మైనార్టీల అవగాహన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. అయితే ఉమ్మడి కర్నూలు జిల్లా ముస్లిం మైనార్టీల అవగాహన సదస్సును ఆదివారం టీడీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్​తో పాటు.. తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి ఎన్.ఎం.డి ఫరూక్, మైనార్టీ ముఖ్య నేతలు పాల్గోన్నారు. 

ప్రతి ముస్లిం టీడీపీ గెలుపు కోసం కృషి చేయాలని ఆయన కోరారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలో రావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. మదనపల్లి మాజీ శాసనసభ్యులు షాజహాన్ మాట్లాడుతూ.. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర భవిష్యత్తు శూన్యమైతుందని విమర్శించారు. విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు కొనసాగుతాయని అన్నారు. 

Last Updated : Nov 26, 2023, 10:54 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.