Murder Case Accused Warning Selfie Video: 'మా జోలికొస్తే పరిస్థితులు వేరేలా ఉంటాయ్..' హత్య కేసు నిందితుడి సెల్ఫీ వీడియో - శ్రీసత్యసాయి జిల్లా లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
Ramakrishna Reddy Murder Case Accused Selfie Video: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం వైసీపీ మాజీ సమన్వయకర్త(ఇంఛార్జి) చౌళూరు రామకృష్ణారెడ్డి హత్య కేసులో నిందితుడు వరుణ్ అలియాస్ వరూ విడుదల చేసిన సెల్ఫీ వీడియో (Selfie Video) కలకలం రేపుతోంది. హత్య కేసులో నిందితుడిగా ఉన్న అతడు బెయిల్పై బయటకు వచ్చాడు. ఈ క్రమంలో రామకృష్ణారెడ్డి సోదరి మధుమతిరెడ్డికి వార్నింగ్ (Warning) ఇస్తూ వీడియో విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. భూ కబ్జాలు, కాంట్రాక్టర్లను బెదిరించి డబ్బులు వసూలు చేయడం తప్ప రామకృష్ణారెడ్డి (Ramakrishna Reddy) హిందూపురానికి చేసిందేమీ లేదని అతడు వీడియోలో తెలిపాడు. దీంతోపాటు రామకృష్ణారెడ్డి చేసిన ఎన్నో అరాచకాలకు తాను కళ్లారా చూశానని,.. అలాంటివాడు చనిపోవటం వల్ల గ్రామానికి మంచే జరిగిందని అన్నాడు. మీ తమ్ముడు రామకృష్ణారెడ్డి ఎలాంటి వారో తెలుసుకోవాలని మధుమతిరెడ్డికి వీడియో సందేశం పంపించాడు. ఇప్పుడు తన జోలికి కానీ,.. తనకు సంబంధించిన వాళ్ల జోలికి కానీ వస్తే పరిస్థితులు వేరేగా ఉంటాయని వారిని హెచ్చరించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారగా.. దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.