విజయవాడలో మూడో రోజుకు చేరిన మున్సిపల్ కార్మికుల రిలే దీక్షలు - తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 13, 2023, 5:05 PM IST
Municipal Workers Strike in Vijayawada : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజయవాడ ధర్నాచౌక్ వద్ద మున్సిపల్ కార్మికులు చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరాయి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. అలాగే ఇంజనీరింగ్ కార్మికులకు హెల్త్, రిస్క్ అలవెన్సులు చెల్లించాలని కోరారు. జీవో నంబర్ 30ను సవరించి కార్మిక శాఖ రికమెండేషన్స్ అమలు చేయాలని తెలిపారు. విలీన గ్రామాలు, కరోనా, వరదల సమయంలో కొత్తగా తీసుకున్న కార్మికులకు మున్సిపల్ కార్మికుల జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నాగభూషణం మాట్లడుతూ, గత మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్మికులు విజయవాడలో ఆందోళనలు చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వనికి చీమకుట్టినట్టు కూడా లేదంటూ విమర్శించారు. గతంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం సమస్యలపై స్పందించకపోతే సమ్మెకు వెనుకాడబోమని తెలిపారు. ప్రజలకు తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ దీపాల ఏర్పాటులో సమస్యలు ఎదురైతే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.