మంత్రి గారూ ఓసారి మా ఊరికి రండి సారూ! - ఆదిమూలపు సురేశ్ నియోజకవర్గంలో అత్యంత దారుణ పరిస్థితి - యర్రగొండపాలెం నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 8, 2023, 1:36 PM IST
Minister AdiMulapu Constituency Roads Situation : ప్రకాశం జిల్లాలోని మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రాతినిధ్యం వహించే యర్రగొండపాలెం నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. త్రిపురాంతకం మండలం వెల్లంపల్లిలోని రహదారులే అందుకు నిదర్శనం. గ్రామంలో మంగళవారం సాయంత్రం చిన్న పాటి వర్షం కురిసింది. ఆ వర్షానికే రహదారులు బురదమయమయ్యాయి.
Muddy Roads With Little Rain in Prakasam District : గ్రామంలో ప్రధాన రహదారి కావడంతో గ్రామస్థులు... రాకపోకలకు పెద్ద సాహసం చేస్తున్నారు. వృద్ధులు, చిన్నారులు నడిచే సమయంలో బురదలో జారి పడుతున్నారని ప్రజలు చెబుతున్నారు. రహదారులు ప్రాణాంతకంగా మారాయని ప్రభుత్వం పట్టించుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మంత్రి సురేశ్ కు ఎన్ని సార్లు సమస్య చెప్పినా ఫలితం ఉండడం లేదని ప్రజలు వాపోతున్నారు. చిన్నపాటి జల్లులకే బురద గుంతలుగా మారిన రోడ్లు చూస్తూ అధికారులు చర్యలు తీసుకోకపోవడం దురదుష్టకరమన్నారు. ప్రజల సమస్యలు పట్టనట్టు మంత్రి నియోజక వర్గంలో రోడ్డు సౌకర్యం కూడా లేకపోవడం దారుణమని గ్రామస్థులు మండిపడుతున్నారు.