thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 12, 2023, 8:56 PM IST

ETV Bharat / Videos

MLA Undavalli Sridevi on Chandrababu Arrest: వచ్చే ఎన్నికల్లో వైసీపీ భూస్థాపితం.. చంద్రబాబే సీఎం: శ్రీదేవి

MLA Undavalli Sridevi on Chandrababu Arrest: చంద్రబాబును తప్పుడు కేసులతో వైసీపీ ప్రభుత్వం జైల్లో పెట్టినా.. ఆయన అతి త్వరలోనే కడిగిన ముత్యంలా బయటకు వస్తారని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. చంద్రబాబు కోసం నేడు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో నిరసనలు చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు నాయుడు ప్రపంచ నేత అని కొనియాడారు. అటువంటి వ్యక్తిని ఇలా బాధ పెట్టడం దారుణమని అన్నారు. గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన పార్టీ సమావేశానికి వచ్చిన ఉండవల్లి శ్రీదేవి మీడియాతో మాట్లాడారు. 

చంద్రబాబుని ఫ్యాక్షనిస్టు, నేరగాడిలా అరెస్టు చేసి తరలించారని శ్రీదేవి వ్యాఖ్యానించారు. అయినా చంద్రబాబు బెదరకుండా కార్యకర్తల్లో ధైర్యం నింపారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ భూస్థాపితం కావటం ఖాయమని విశ్వాసం వెలిబుచ్చారు. పులి ఒక అడుగు వెనక్కు వేస్తే భయపడినట్లు కాదని.. వైసీపీ నేతలు చంద్రబాబుపై వేస్తున్న రాళ్లతో ఓ భారీ కట్టడం ఖాయమని వ్యాఖ్యానించారు. 2024 ఎన్నికల్లో టీడీపీ గెలిచి చంద్రబాబు సీఎం అవుతారని శ్రీదేవి విశ్వాసం వ్యక్తం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.