ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే తనిఖీలు చేయటం బాధాకరం-ఎమ్మెల్యే రాచమల్లు - MLA Rachamallu

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 18, 2024, 7:23 PM IST

MLA Rachamallu Protest Police Checkings: పోలీసుల తీరును నిరసిస్తూ వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి బంగారం వ్యాపారులతో కలిసి నిరసనకు దిగారు. వైయస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మెయిన్ బజార్ వీధిలో బంగారం దుకాణాల వద్ద వ్యాపారులతో కలిసి రాచమల్లు బైఠాయించారు. బంగారం కొనడానికి వచ్చిన ప్రజల వద్ద బిల్లులు లేవని డబ్బును సీజ్ చేయటం అన్యాయమని రాచమల్లు మండిపడ్డారు. 

Rachamallu Requested To Stop Police Inspections Till Election Notification: ఎన్నికల నోటిికేషన్ రాకముందే బిల్లులు లేని డబ్బును పోలీసులు సీజ్ చేయడం బాధాకరం అని రాచమల్లు అభిప్రాయపడ్డారు. పోలీసులు తనిఖీలు చేస్తుండటంతో వ్యాపారం భయంభయంగా చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని రాచమల్లు అన్నారు. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే రాచమల్లు వెల్లడించారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో పోలీసులు తనిఖీలు చేసి బిల్లులు లేని డబ్బును ఆదాయశాఖ అధికారులకు అప్పగిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు పోలీసులు తనిఖీలు ఆపాలని రాచమల్లు అధికారులను కోరారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.