పార్టీ మారినందుకు పెట్రోల్ బంకుపై దాడి - ఫిర్యాదు చేస్తే పట్టించుకోని పోలీసులు - kakinada political news
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 23, 2023, 12:28 PM IST
MLA's Followers Attacked Petrol Station : కాకినాడ వార్పు రోడ్డులోని ఇండియన్ పెట్రోల్ బంకుపై కొందరు దుండగులు దాడి చేసిన విషయం స్థానికంగా కలకలం రేపింది. నగదు ఎత్తుకెళ్లడంతో పాటు పెట్రోల్ బంక్‌ను స్వాధీనం చేసుకున్నారని యజమాని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశాడు. కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారం పూడి చంద్రశేఖర్ బంక్‌పై దాడి చేయించారని ఆరోపించాడు.
Police Took Action Against MLA's Followers : ఇటీవల తాను వైసీపీ నుంచి జనసేనలో చేరినందుకే ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారని రామకృష్ణ మండిపడ్డాడు. ఎమ్మెల్యే అనుచరులు 20 మంది దాడి చేసినట్లు ఆరోపించాడు. ఈ విషయాన్ని స్థానిక వన్ టౌన్ పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదని వాపోయాడు. ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రజలకు అండగా ఉండాల్సిన పోలీసులు అధికార నాయకులకు అనుగుణంగా నడుచుకుంటున్నారని ధ్వజమెత్తాడు. రానున్న ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేను గద్దె దించి బుద్ధి చెబుతారని హెచ్చారించాడు.