Anam's comments on Jagan: దుర్మార్గపు పాలన అంతానికి అందరూ సిద్ధం కావాలి: ఎమ్మెల్యే ఆనం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 4, 2023, 6:07 PM IST

Anam's comments on Jagan's rule : రాష్ట్రంలో సుపరిపాలన పేరుతో అప్రజాస్వామిక పాలన నడుస్తోందని, ఈ దుర్మార్గపు, దౌర్భాగ్యపు పాలన అంతానికి అందరూ నడుం బిగించాలని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. చట్టసభల్లో జరగాల్సిన నిర్ణయాలు, ప్రభుత్వ కార్యకలాపాలన్నీ క్యాంప్ కార్యాలయం వేదికగా సాగుతున్నాయని తెలిపారు. ఆత్మకూరులోని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆనం.. పై విధంగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వ కార్యకలాపాలన్నీ క్యాంప్ కార్యాలయంలో సాగుతున్నాయని, ఏడాదికి ఒకసారి జరిగే బడ్జెట్ సమావేశాలు కూడా పూర్తి స్థాయిలో జరగడం లేదని, కనీసం 15 రోజులు కూడా నిర్వహించడం లేదని తెలిపారు. సుపరిపాలన పేరుతో అప్రజాస్వామిక పాలన రాష్ట్రంలో నడుస్తోందని, ఏదీ రాజ్యాంగపరంగా జరగడం లేదని చెప్పారు. దోపిడీకి ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నారు.. రాజ్యాంగ వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి.. శాసన సభ నుంచి గ్రామ పంచాయతీ సభల వరకూ దేనికీ విలువలు లేవు అని పేర్కొన్నారు. గతంలో 60 రోజులు జరిగే శాసన సభ సమావేశాలు 15 రోజులకు తగ్గిపోయాయని ఆనం తెలిపారు. ప్రజల అవసరాలు‌ పట్టించుకోవటం లేదని, ప్రాజెక్టుల పనులు జరగడం లేదని, జిల్లా స్థాయి సమావేశాల్లో కూడా పరిపూర్ణత లేదని అన్నారు. అందుకనే వాటికి వెళ్లడం లేదు.. ఏ అధికారి కూడా స్వతంత్రంగా వ్యవహరించే పరిస్థితి లేదని తెలిపారు. వాలంటీర్లకే సర్వ హక్కులు ఉన్నాయన్న ఆనం.. తాజాగా గృహ సారథులు వచ్చారని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సర్పంచ్​లకు కూడా అధికారాలు లేవని చెప్పారు. మన రాష్టంలో మందు తాగే వాళ్లకు లివర్, కిడ్నీలు పాడై పోయి ఆ కుటుంబాలు వీధిన పడుతున్నాయని, జగన్ ప్రభుత్వం మళ్లీ అప్పుల కోసం రిజర్వ్ బ్యాంక్ చుట్టూ తిరుగుతోందని ఎమ్మెల్యే ఆనం తెలిపారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.