మంత్రి రోజా ఇది తగునా? తిరుమలలో 'శిలువ' గుర్తుతో వ్యక్తిగత ఫొటోగ్రాఫర్ హల్చల్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 2, 2023, 1:13 PM IST
Minister Roja Photographer Violate Rules in Tirumala : పర్యాటక శాఖ మంత్రి రోజా వ్యక్తిగత ఫొటోగ్రాఫర్ తిరుమలలో నిబంధనలు ఉల్లంఘించడం తీవ్ర చర్చనీయాంశమైంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకునేందుకు మంత్రి రోజా తిరుమలకు వచ్చారు. ఆమెతో పాటు తన వ్యక్తిగత ఫొటోగ్రాఫర్‌ను కూడా వెంటబెట్టుకొచ్చారు.
RK Roja Personal Photographer Stein Break the Rules in Tirumala Tirupati Temple : ఈ నేపథ్యంలో ఫొటోలు తీసేందుకు రోజా వ్యక్తిగత ఫొటోగ్రాఫర్ స్టెయిన్ (RK Roja Personal Photographer Stein) అన్యమత గుర్తు ఉన్న గొలుసుతో గొల్ల మండపం ఎక్కారు. వాస్తవానికి తిరుమల కొండలపై అన్యమత గుర్తుల ప్రదర్శనపై నిషేధం ఉంది. స్టెయిన్ తీరును గమనించిన భక్తులు అసహనం వ్యక్తం చేశారు. ఇటువంటి వారిని అదుపులో ఉంచాల్సిన మంత్రి రోజా.. ఏ మాత్రం నిబంధనలను పట్టించుకోకుండా శ్రీవారి ఆలయం వద్ద ఫొటోలు తీసుకోవడంలో నిమగ్నమయ్యారు. అయినప్పటికీ ఫొటోగ్రాఫర్ ఇలా వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ లెక్కన రోజా తిరుమలకు వచ్చిన ప్రతీసారి నిబంధనలు ఉల్లంఘన జరిగిందని అనుకుంటున్నారు. హిందూ ఆచారాల పవిత్రతకు భంగం కలిగేలా ఫొటోగ్రాఫర్ ప్రవర్తించారంటూ పలువురు మండిపడుతున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానానికి రాజకీయ గుర్తులు, అన్యమత గుర్తులు, జెండాలు తీసుకుని రావొద్దని నిషేధం ఉన్నప్పటికి అధికారం పార్టీలో ఉన్న మంత్రి రోజా వ్యక్తిగత ఫొటోగ్రాఫర్ స్టెయిన్ తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.