Minister Rajini on MBBS Seats: 'నూతన మెడికల్ కాలేజీల్లో ప్రపంచస్థాయి సదుపాయాలు' - వైద్య కళాశాలలపై మంత్రి రజిని వ్యాఖ్యలు
🎬 Watch Now: Feature Video
Minister Rajini comments on medical colleges: నూతనంగా నిర్మించిన ఐదు వైద్య కళాశాలల్లో ప్రపంచస్థాయి సదుపాయాలు కల్పిస్తామని వైద్యారోగ్య శాఖమంత్రి విడదల రజిని తెలిపారు. విశాఖ కలెక్టర్ ఆఫీస్లో మీడియాతో మాట్లాడిన మంత్రి రజిని.. మెడికల్ కాలేజీలు ఆర్థిక స్వయం ప్రతిపత్తితో నడిచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు.. విద్యార్థులు మెడికల్ సీట్లు కోసం ఇతర దేశాలకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు ద్వారా స్థానికంగా విద్యార్థులకు మేలు జరుగుతుందని తెలిపారు. ఈ కొత్త మెడికల్ కాలేజీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు నష్టం కలగదని వివరించారు. మెడికల్ కాలేజీ నిర్వహణ ప్రభుత్వానికి ఆర్థిక భారం కాదని.. జనరల్ కేటగిరీకి రూ.15 వేలు, బి కేటగిరీకి రూ. 12 లక్షలు, ఎన్ఆర్ఐ సీట్లకు రూ.20 లక్షలు చొప్పున ఫీజుగా ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.. అభినందించాల్సిన దశలో విమర్శించడం బాధాకరమన్నారు. గ్రామ వార్డ్ సచివాలయం వాలంటీర్లను ప్రభుత్వం సత్కరిస్తోందని ప్రభుత్వ కార్యక్రమాలు వాలంటీర్లే ప్రజలకు అందిస్తున్నారని అటువంటి వావంటీర్ల వ్యవస్తను విమర్శించడం బాధాకరం మంత్రి రజిని అన్నారు.