Minister Kottu Satyanarayana Comments: అందుకే... విశాఖకు ప్రభుత్వ శాఖల తరలింపు ముహూర్తం డిసెంబర్‌కు మారింది: మంత్రి కొట్టు - వైసీపీ నేత కొట్టు సత్యనారాయణ పర్యటన
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 17, 2023, 10:11 PM IST
Minister Kottu Satyanarayana Comments: విశాఖలో ప్రభుత్వ శాఖల వసతులు సమకూర్చుకోవాల్సి ఉందని, అందుకే ముహూర్తం డిసెంబర్‌కు మారిందని.. దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. డిసెంబర్ నెల నుంచి విశాఖపట్నం నుంచి పరిపాలన చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు.. కొట్టు తెలిపారు. విశాఖపట్నంలో వివిధ శాఖల అధికారుల కార్యాలయాలు, వసతి గదులు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పనులన్నీ తొందరగా అయ్యేవి కావు కాబట్టే... డిసెంబర్ నుంచి విశాఖకు వెళ్లాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు.
ప్రతిపక్ష నేత నారా చంద్రబాబును చట్టపరంగానే అరెస్టు చేసినట్లు మంత్రి చెప్పారు. జైల్లో ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు. తమకు చంద్రబాబుపై ఎలాంటి కక్ష లేదని వెల్లడించారు. రాజమండ్రి జైల్లో చంద్రబాబుకు పూర్తి రక్షణ ఉంటుందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ తమకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయ్యే అవకాశం ఉందన్నారు. చంద్రబాబు అరెస్ట్ విషయంలో కోర్టు తీర్పుల మేరకే అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.