Minister Kottu Reply to PK: పార్టీ పెట్టింది రాజకీయాలు చేసేందుకా.. జగన్‌ను తిట్టేందుకా - ntr dist latest news
🎬 Watch Now: Feature Video
Minister Kottu Reaction On Pawan Kalyan Comments: ఎవరి మెప్పు కోసం వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు. వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలు, చెప్పిన గణాంకాలు ఆయనకు ఎవరు రాసిచ్చారో చెప్పాలన్నారు. జనసేన పార్టీని రాజకీయాలు చేసేందుకు పెట్టారా.. జగన్‌ను తిట్టేందుకు పెట్టారా అనే విషయంపై పవన్ స్పష్టతనివ్వాలని మంత్రి డిమాండ్ చేశారు. ఇటీవల పవన్ చేసిన వ్యాఖ్యలు గమనిస్తే జనసేన అధికారంలోకి వస్తే క్వాలిటీ మద్యం అమ్మిస్తాను.. యువతతో తాగిస్తాను అన్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయని మంత్రి సత్యనారాయణ ఎద్దేవా చేశారు. వాలంటీర్లు ఇచ్చిన సమాచారం హైదరాబాద్కు చేరుతోందనేందుకు పవన్ దగ్గర ఎలాంటి ఆధారం ఉందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. వాలంటీర్స్ ప్రజలకు సంబంధించిన వివరాలను అసాంఘిక శక్తులకు ఇస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవన చేసిన ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపాయి. పవన్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే కొందరు మంత్రులు కూడా స్పందించారు.