Minister Dharmana Prasada Rao Sensational Comments: "మంచోళ్లే కావాలనుకుంటే.. పూజారులను ఎన్నుకోండి" - మత్స్యకారులకు లైఫ్ జాకెట్స్ పంపిణీ
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 22, 2023, 4:25 PM IST
Minister Dharmana Prasada Rao Sensational Comments : మంచోళ్లే కావాలనుకుంటే.. దేవుడి గుడిలోని పూజారులను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీని రానున్న ఎన్నికల్లో ఒకసారి గెలిపించాలని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కోరుతున్నారని.. 14 ఏళ్లు అవకాశం ఇస్తే, ఏం అభివృద్ధి చేశారని మంత్రి ప్రశ్నించారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలోని సీపన్నాయుడుపేటలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధర్మాన ప్రసాదరావు పాల్గొన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చినప్పటి నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన వారికి ఓటు వేసి గెలించాలని,.. అలాగే అభివృద్ధి చేయని వారిని గుణపాఠం చెప్పాలని ఆయన తెలిపారు. దేశంలో అన్ని చోట్ల ధరలు పెరిగాయన్న ధర్మాన.. మోదీ ప్రభుత్వమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలకు తెలుగుదేశం పార్టీ పట్ల అభిమానం ఉండొచ్చు కానీ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుంటే, జరగలేదని చెప్పడాన్ని మంత్రి ధర్మాన ప్రసాదరావు తప్పుపట్టారు.
మత్స్యకారులకు లైఫ్ జాకెట్స్ పంపిణీ : మత్స్యకారుల సంక్షేమమే ప్రధాన ధ్యేయమని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. శ్రీకాకుళం రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మగటపల్లి వెంకట రమణమూర్తి ఛారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో మత్స్యకారులకు లైఫ్ జాకెట్స్ మంత్రి ధర్మాన పంపిణీ చేశారు. మత్స్యకారులకు ప్రాణాపాయం లేకుండా ఉండేందుకు వేట సమయంలో లైఫ్ జాకెట్ల వాడకం ఎంతో ముఖ్యమన్న ధర్మాన.. అందుకే వీరి కోసం రెడ్ క్రాస్ సంస్థ ముందుకు వచ్చి లైఫ్ జాకెట్లు అందజేసిందన్నారు. మొదటి విడతలో భాగంగా రెండు వందల మందికి ఈ లైఫ్ జాకెట్స్ ఇచ్చామన్న మంత్రి... లైఫ్ జాకెట్స్ ఉపయోగించే వారి అభిప్రాయాల మేరకు మిగిలిన మత్స్యకారులకు ఇచ్చేందుకు సీఎం దృష్టికి తీసుకు వెళ్తానన్నారు.