కెరీర్ టూల్‌కిట్ ఆన్‌లైన్ టీచింగ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన మంత్రి బొత్స
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 4, 2024, 4:50 PM IST
Minister Botsa Satyanarayana Launched Career Toolkit Programme: ఉన్నత (ఆర్ట్స్, సైన్స్, మెడికల్) విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులకు వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి రూపొందించిన 'కెరీర్ టూల్‌కిట్ ఆన్‌లైన్ టీచింగ్ ప్రోగ్రామ్'ను విద్యాశాఖ మంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.
Botsa Comments: ''రాష్ట్రంలో ఎవరైతే ఉన్నత (ఆర్ట్స్, సైన్స్, మెడికల్) విద్యను పూర్తి చేసుకున్నారో వారికి వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 'కెరీర్ టూల్‌కిట్ ఆన్‌లైన్ టీచింగ్ ప్రోగ్రామ్'ను రూపొందించింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకుంది. ఈ పోగ్రామ్ ద్వారా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి, ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. విద్యార్థి మీద ఎక్కడ కూడా ఆర్థిక భారం పడకుండా అంతా ప్రభుత్వమే భరిస్తుంది. ఈ కెరీర్ టూల్‌కిట్‌ను రూపొందించిన ప్రతి ఉద్యోగిని ప్రభుత్వం తరుఫున అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా విశ్వవిద్యాలయాలు అందించే 2వేల కోర్సులను ఆన్‌లైన్‌లో చదువుకునే వెసులుబాటును కల్పిస్తున్నాం. సెమిస్టర్ల వారీగా విద్యార్ధులకు కార్యాచరణ ప్రణాళిక అందించడమే లక్ష్యంగా 19 రకాల కెరీర్ టూల్‌కిట్లను తెచ్చాం'' అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.