Adimulapu Suresh on Pawan: అవినీతి జరిగితే.. ఎక్కడో చూపించండి.. మంత్రి సురేష్ డిమాండ్ - minister Adimulapu Suresh
🎬 Watch Now: Feature Video
Adimulapu Suresh Comments on Pawan Kalyan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహా ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ పిచ్చిగా మాట్లాడుతున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రభుత్వంలో అవినీతి జరిగిందని అంటున్నవారు ఎక్కడ జరిగిందో చూపాలని డిమాండ్ చేశారు. ప్రజలిచ్చిన అవకాశాన్ని సీఎం జగన్ సద్వినియోగం చేసుకున్నారన్న ఆయన.. 5 కోట్ల 30 లక్షల మంది ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అన్నారు. చివరి అవకాశం అని ఒకరు, ఒక్క అవకాశం అని మరొకరు వస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎస్సీలకు 25 స్కీంలు సీఎం జగన్ ఎత్తివేశారని పవన్ కల్యాణ్ చేస్తున్న ఆరోపణలను ఖండించారు.
ఆరోపణల దృష్ట్యా త్వరలో వీటిపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. ఎస్సీల కోసం ప్రభుత్వం ప్రతి పథకాన్ని ఎలా అమలు చేస్తుందో చెబుతామన్న మంత్రి.. ఎస్సీలకు సబ్ ప్లాన్ సహా పలు పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ఎస్సీల అభ్యున్నతికి ప్రభుత్వం పాటు పడుతుందన్నారు. అంబేడ్కర్ భావజాలాన్ని మేము అమలు చేస్తున్నామని, విజయవాడ నడి బొడ్డున అంబేడ్కర్ భారీ విగ్రహాన్ని నిర్మిస్తున్నట్లు ఆదిమూలపు సురేష్ తెలిపారు.