తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం - రేపు తీరం దాటనున్న 'మిథిలి' - అమరావతి తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 17, 2023, 1:56 PM IST
|Updated : Nov 17, 2023, 10:35 PM IST
Midhili Cyclone 2023 In Amaravati : బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. ప్రస్తుతం దీన్ని మిథిలి తుపానుగా భారత వాతావరణ విభాగం వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఇది వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశాలోని పారాదీప్‌నకు 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు వాతావరణశాఖ తెలిపింది. గంటకు 20 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతున్నట్టు ఐఎండీ భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. క్రమంగా ఉత్తర వాయువ్యంగా కదులుతూ శనివారం ఉదయానికి బంగ్లాదేశ్‌లోని ఖెపుపారా వద్ద తుపాను తీరం దాటనుంది.
Midhili Cyclone Entering into Andhrapradesh : తీరం దాటే సమయంలో బంగ్లాదేశ్‌లోని తీరప్రాంతాల్లో గంటకు 80కి.మీ. అతి వేగంగా గాలులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తుపాను ప్రభావంతో ఏపీలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ కారణంగా సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఐఎండీ హెచ్చరించింది.