మొలక ధాన్యానికి మేలైన ధర దొరికేనా? అన్నదాతకు ఈరట కలిగేనా? - మిగ్జాం వల్ల పంట నష్టం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 11, 2023, 1:41 PM IST
Michaung Effect On Paddy In Krishna District : తడిసిపోవడంతో వరి కంకులు మొలకలు వస్తున్నాయని, ఆరుగాలం కష్టానికి ప్రతిఫలంగా వచ్చే పంట గట్టు దాటకుండానే పాడైపోతోందని అన్నదాతలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసిన అప్పులు తీర్చలేకపోతే ఆత్మహత్యలే శరణ్యమని వాపోతున్నారు. పూర్తిగా తడిసి మొలకల్లా మారిన పంటను కొనాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తే తప్ప తమకు ఎటువంటి దారి లేదని ఆందోళన చెందుతున్నారు.
Farmers Problems In Krishna 2023 : ఎకరానికి సుమారు రూ. 30 వేలు ఖర్చు అయ్యిందని, అప్పులు తీర్చలేకపోతే చావే దిక్కని అంటున్నారు. ప్రభుత్వం కనీస మద్ధతు ధరతో పంట కొనుగోలు చెయ్యాలని అన్నదాతలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరో వైపు పంట పొలాల్లోనే ధాన్యాన్ని ఆరబెట్టడానికి శత విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మిగ్జాం తుపాను కారణంగా నోటి దాకా వచ్చిన ముద్ద నేల పాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ రైతును కదిలించిన పంట నష్టపోయామని ఇక తమ గతేెంటని సతమతమైవుతున్నారు.