పంట నీటి పాలైందని మహిళా రైతు కన్నీరు - మనసు చలించే దృశ్యం - ఏపీ తాజా వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 6, 2023, 4:47 PM IST

Michaung cyclone in Bapatla District : మిగ్‌జాం తుపాను రైతులను పీకల్లోతు నష్టాల్లోకి నెట్టింది. భారీ వర్షాలతో బాపట్ల జిల్లాలో పొలాలు ముంపునకు గురయ్యాయి. వరి పంట మొత్తం నీళ్లలోనే నానుతుంది. ఇది ఇలా ఉండగా మరోవైపు కోసిన ధాన్యం తడిచిపోయి మొలకలు వస్తున్నాయి. రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంట నీటిపాలవ్వడంతో ఓ మహిళా రైతు పొలంలోనే దీనంగా కూర్చుని కలత చెందారు. వేమూరు మండలం క్రాపలో తెలుగుదేశం నేతలు పర్యటించి నష్టపోయిన పంటలను పరిశీలించారు. మహిళా రైతు తన గోడును వెల్లబోసుకుంటూ కంటతడి పెట్టారు. 

cyclone affected Crops in AP : ప్రభుత్వ వైఫల్యం వల్లే రైతులు తీవ్రంగా నష్టపోయారని మాజీమంత్రి మండిపడ్డారు. రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు  విమర్శించారు. చివరి గింజ కొనేవరకు రైతులకు తోడుగా పోరాడుతామని తెలిపారు. పంట మొత్తం నీళ్ల పాలైందని ఆవేదన చెందిన రైతులను నక్కా ఆనంద్ బాబు పరామర్శించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.