హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం - షాపింగ్ మాల్లో చెలరేగిన మంటలు - fire Accident in CMR
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 2, 2024, 10:59 PM IST
Massive fire Accident in CMR Shopping mall at Uppal: హైదరాబాద్‌లో మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గుడి మల్కాపూర్‌లోని అంకుర హాస్పిటల్లో ఫైర్ యాక్సిడెంట్ మరిచిపోకముందే ఉప్పల్ సీఎంఆర్ షాపింగ్ మాల్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మాల్ ముందు భాగంలో అంటుకున్న మంటలు మాల్ అంతటికీ శరవేగంగా వ్యాపిస్తున్నాయి. మాల్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన డెకరేషన్లో మంటలు అంటుకున్నాయని తెలుస్తోంది.
మంటలు అంటుకున్న సమయంలో షాపింగ్ మాల్లో ఎంత మంది ఉన్నారన్న విషయం ఇంకా తెలియలేదు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు ఫైర్ స్టేషన్‌కు సమాచారమిచ్చారు. వెంటనే స్పందించిన అగ్ని మాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పే పనిలో ఉన్నారు. ఈ ఘటనలో ఎవరైనా గాయపడిన విషయం ఇంకా తెలియడం లేదు. ఉప్పల్ పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు అదుపులోకి వచ్చిన తరువాతే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం వివరాలు తెలిసే అవకాశముంది.