Mahabharata Shobhayatra at Vijayawada: నన్నయ్య అనువదించిన మహాభారతానికి వెయ్యేళ్లు.. వైభవంగా శోభాయాత్ర.. - తెలుగు భాషలో మహాభారతం లేటెస్ట్ న్యూస్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 22, 2023, 2:11 PM IST

Mahabharata Shobhayatra at Vijayawada: మహాభారతాన్ని ఆదికవి నన్నయ్య తెలుగులోకి అనువదించి వెయ్యేళ్లు పూర్తయిన సందర్భంగా విజయవాడలో మహాభారత శోభాయాత్ర నిర్వహించారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని ప్రపంచానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ శోభాయాత్ర చేపట్టినట్లు నిర్వహకులు తెలిపారు. సుమారు వెయ్యి మంది విద్యార్థులతో నిర్వహించిన ఈ యాత్ర కేబీఎస్‌ కళాశాల నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు సాగింది. మహాభారత కావ్యాన్ని ప్రతి ఒక్కరు చదివి ఆచరించాలని వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు 2వేల మంది విద్యార్థులతో ద్వి సహస్త్ర గళ పద్యార్చన కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సాయంత్రం జరిగే ఈ కార్యక్రమానికి భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరుకానున్నారు.

"తెలుగు భాష ఔన్నత్యాన్ని, మహాభారతం విశిష్టతను,  నన్నయ్య గొప్పతనాన్ని.. ప్రపంచానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ శోభాయాత్ర చేపట్టాం. ఆదికవి నన్నయ తెలుగులో అనువదించిన మహాభారతంలో రెండున్నర పర్వాలను, 500లకు పైగా పద్యాలను మా విద్యార్థులతో కంఠస్థం చేయించాము. సుమారు 2,000 మంది విద్యార్థులు నాలుగు నెలల నుంచి 108 పద్యాలను అభ్యసించారు. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల సమయంలో ద్వి సహస్త్ర గళార్చన కార్యక్రమం నిర్వహించనున్నాము." - కార్యక్రమం నిర్వాహకులు

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.