Lorry fire on national highway: విశాఖలో జాతీయ రహదారిపై లారీ దగ్ధం.. పరుగులు తీసిన ప్రయాణికులు! - Arilova lorry incident
🎬 Watch Now: Feature Video
Lorry fire on Visakhapatnam national highway: విశాఖలో జాతీయ రహదారిపై భారీ మంటలతో లారీ అగ్నికి ఆహుతి అయింది. ఆరిలోవ పరిధిలో జాతీయ రహదారి ఎండాడ వద్ద ఈ ఘటన జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో విశాఖ పోర్ట్ నుంచి ఐరన్ ఓర్ లోడ్‌తో ఒరిస్సా వెళ్తున్న 14 టైర్ల లారీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారి గా మంటలు చెలరేగాయి. భయాందోళనతో డ్త్రెవర్, క్లీనర్.. లారీని అక్కడే నిలిపేసి కిందికి దూకాడంతో ప్రాణాలను కాపాడుకున్నారు. మంటల్లో చిక్కుకున్నా లారీ చాలా వరకు కాలిపోయింది. సమాచారం తెలిసి సంఘటన జరిగిన ప్రాంతానికి పోలీసులు చేరుకుని ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. రోడ్డు మధ్యలో ఈ ఘటన జరగడం వల్ల మధురవాడ వైపు వెళ్లే వాహనాలు రెండు కిలోమీటర్ల వరకు నిలిచిపోయి ప్రయాానికులు ఇబ్బంది పడ్డారు. కొద్దిసేపటి తరువాత పోలుసులు రాకపోకలను క్రమబద్ధీకరించారు.