వేగంగా వెళ్తున్న లారీ - వంతెనపై బ్రేకులు ఫెయిల్ - ఏం జరిగిందంటే! - లారి బీభత్సం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 9, 2024, 4:00 PM IST
|Updated : Jan 9, 2024, 4:50 PM IST
Lorry Accident At Balabhadrapuram: తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రాపురంలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఈరోజు ఉదయం కాకినాడ వైపు లోడుతో వెళ్తున్న లారీ బలభద్రాపురం వంతెన పైకి వచ్చేసరికి బ్రేకులు ఫెయిలయ్యాయి. దీంతో ఎదురుగా వెళ్తున్న ట్రాక్టర్ను, ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి, పక్కనే ఉన్న ఒక ఫ్లెక్సీ బోర్డును ఢీకొని ఆగింది. ఈ క్రమంలో ట్రాక్టర్, బైకు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగక పోవటంతో గ్రామస్థులు అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇటీవల నెల్లూరు జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెలంగాణ ఆర్టీసీకి చెందిన బస్సు లారీని వెనకనుంచి ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఒకరు ప్రమాద స్థలంలోనే మృతి చెందగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ప్రాణాలు విడిచారు. టీఎస్ఆర్టీసీ బస్సు మిర్యాలగూడ నుంచి తిరుపతి వెళ్తుండగా నెల్లూరు జిల్లా మోచర్ల వద్దకు చేరుకోగానే లారీని వెనకవైపు నుంచి వేగంగా ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం బాగా నుజ్జునుజ్జయ్యింది.