ఆ నీళ్లు తాగితే అంతే సంగతులు.. స్థానికుల ఆగ్రహం - టిడ్కో గృహాల్లో నీటి సమస్యలు
🎬 Watch Now: Feature Video
Polluted Water for Drinking: మంగళగిరి పట్టణంలోని టిడ్కో గృహాలకు ఫిల్టర్ బెడ్స్, పచ్చగా మారిన ప్రాణాంతకమైన తాగునీటి సరఫరా చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వీడియో ద్వారా అధికారులను ప్రశ్నించారు. 1728 మంది కుటుంబాలు నివసిస్తున్న టిడ్కో గృహాల్లో సుమారు 9వేల మంది ఉంటున్నారని పేర్కొన్నారు. తొమ్మిది వేల మంది నివాసం ఉంటున్న టిడ్కో గృహాలకు కలుషితమైన తాగునీరును సరఫరా చేస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళన చేశారు. ఈ నీరు తాగటం వల్ల జనాలు రోగాల బారిన పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, ఎమ్మెల్యే, మున్సిపల్ సిబ్బంది స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
తాగునీరు కలుషితం అనే కథనాలపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విటర్లో స్పందించారు. దాదాపు 9 వేల మంది నివసిస్తున్న ఈ ప్రాంతంతో పాటు ఏపీఐఐసీ, ఇతర సంస్థలకీ కలుషిత నీరు సరఫరా చేయడం దారుణమని లోకేశ్ మండిపడ్డారు. స్థానికుల ఫిర్యాదుతో తమ పార్టీ నేతలు ఫిల్టర్ బెడ్స్, పచ్చగా మారిన నీరు, అక్కడి అపరిశుభ్ర పరిస్థితులు పరిశీలించి తన దృష్టికి తీసుకొచ్చారని లోకేశ్ వెల్లడించారు. టిడ్కో నివాసితులకు తక్షణమే సురక్షితమైన తాగునీరు సరఫరా చేయాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చేతకాకపోతే, తాము తమ నిధులతో ఫిల్టర్ బెడ్స్ క్లీన్ చేయించి సురక్షితమైన తాగునీరు అందిస్తామని లోకేశ్ తెలిపారు.