Lokesh Going to Delhi: దిల్లీకి లోకేశ్.. సుప్రీంలో చంద్రబాబు క్వాష్ పిటీషన్‌పై విచారణ నేపథ్యంలో.. - చంద్రబాబు క్వాష్ పిటీషన్‌పై విచారణ
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 7, 2023, 1:53 PM IST
Lokesh Going to Delhi: సుప్రీం కోర్టులో సోమవారం చంద్రబాబు క్వాష్ పిటీషన్‌పై విచారణ నేపథ్యంలో.. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దిల్లీ వెళ్లారు. న్యాయవాదులకు అందుబాటులో ఉండాలని లోకేశ్ నిర్ణయించారు. ఈ క్రమంలో ఆయన రాజమహేంద్రవరం నుంచి దిల్లీ బయలుదేరి వెళ్లారు. లోకేశ్‌తో పాటు రాజమండ్రి విమానాశ్రయం వరకు వెళ్లిన బ్రాహ్మణి అక్కడి నుంచి హైదరాబాద్ వరకు లోకేశ్‌తో బయలుదేరారు. హైదరాబాద్ మీదుగా లోకేశ్ దిల్లీకి పయనమయ్యారు.
తాజా రాజకీయ పరిణామాలు.. పరిస్థితులపై సీనియర్ నేతలు, యువ నాయకులతో లోకేశ్ చర్చించారు. అంతేకాకుండా న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలు.. భవిష్యత్ కార్యాచరణపై ఎంపీ కనకమేడల, బుచ్చయ్య, మాగంటి బాబుతో సమావేశమయ్యారు. అనంతరం లోకేశ్ దిల్లీకి బయల్దేరి వెళ్లారు. మరోవైపు 'కాంతితో క్రాంతి' కార్యక్రమంలో పాల్గొనాలని లోకేశ్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. లోకేశ్ ఈ కార్యక్రమంలో దిల్లీలోనే పాల్గొని సంఘీభావం తెలపనున్నారు. రాత్రి 7 నుంచి 7.05 వరకు ఇళ్లలో లైట్లు ఆఫ్ చేసిన నిరసన వ్యక్తం చేయాలని.. కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్ వేసి చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించడానికే ఈ కార్యక్రమం అని వివరించారు. 'బాబుతో నేను' అంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలంటూ సూచించారు.