గంజాయి గుప్పుమంటున్నా జగన్ సర్కారు పట్టించుకోవడం లేదు: లోకేశ్ - గంజాయి తోటల ధ్వంసం
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/27-12-2023/640-480-20368168-thumbnail-16x9-lokesh-fires-on-jagan-govt.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 27, 2023, 6:04 PM IST
Lokesh Fires on Jagan Govt : జగన్ ప్రభుత్వం గంజాయి వనాలకు కంచెలా మారి కాపలా కాస్తోందనే అనుమానాలు బలపడుతున్నాయని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. గంజాయి వనాల ధ్వంసానికి ఏటా కేటాయించే నిధులు జగన్ అధికారంలోకి వచ్చాక విడుదల చేయకపోవడాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్ వాడకం పెరిగిపోయిందన్నారు. గంజాయిని కట్టడి చేయాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగి చూడటం అనుమానాలకు తావిస్తోందన్నారు.
ఏపీ డ్రగ్స్ హబ్‌గా మారిపోయినా, గంజాయి గుప్పుమంటున్నా జగన్ సర్కారు గంజాయి తోటల ధ్వంసాన్ని ఆపేయడం వెనుక మతలబేంటని లోకేశ్ ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ గంజాయి మాఫియా ఒత్తిడితోనే డిసెంబర్‌లో జరగాల్సిన గంజాయి తోటల ధ్వంసం ప్రక్రియ నిలిపేశారనే ఆరోపణలకు జగన్ సర్కారు సమాధానం చెప్పాలని లోకేశ్ డిమాండ్ చేశారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రతి ఏటా డిసెంబర్ నెలలో ఆంధ్రా - ఒరిస్సా సరిహద్దులో ఏపుగా పెరిగిన గంజాయి తోటలను ధ్వంసం చేయిస్తుందని, దాని కోసం నిధులు కూడా కేటాయిస్తాయని పేర్కొన్నారు.