Lok Adalat to be held on Sept 9 in East Godavari : తూర్పుగోదావరి జిల్లాలో సెప్టెంబర్ 9న లోక్ అదాలత్.. 15 చోట్ల ఏర్పాటు.. - తూర్పు గోదావరి లోకల్ వార్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 2, 2023, 2:03 PM IST
Lok Adalat to be held on Sept 9 in East Godavari : ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సెప్టెంబర్ 9న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్టు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె ప్రత్యూష కుమారితో కలిసి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. జిల్లా న్యాయసేవాధికార సంస్థతోపాటు మండల స్థాయి న్యాయ సేవసాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 15 లోక్ అదాలత్ల్లో మిగిలిన కేసుల కోసం సెప్టెంబర్ 9న జాతీయ లోక్ అదాలత్(national lok adalat) నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ లోక్ అదాలత్లో రాజీ చేయాటానికి వీలుగా ఉండే కేసును గుర్తించి వారికి నచ్చచెప్పి రాజీకి వచ్చేలాగా ఒప్పందం చేయాలని నిర్ణయించుకున్నామని అన్నారు. దానిలో భాగంగా గుర్తించిన కేసుల వాళ్లకి నోటీసులు ఇచ్చామని చెప్పారు. ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా కక్షిదారులు కేసులు రాజీ చేసుకొని సమస్యలు పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. న్యాయ సేవ సాధికార సంస్థ ద్వారా వివిధ కేసుల్లో న్యాయ సేవలు అవసరమైన నిరుపేదలు, గిరిజనులు, మహిళలకు సాయం అందిస్తామని చెప్పారు. అలాగే అసంఘటిత రంగంలోని కార్మికులు, వలస కార్మికులకు వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా వారి సంక్షేమానికి పాటుపడతామని అర్హులైన పేదలు వినియోగించుకోవాలని చెప్పారు.