సీఎం జగన్ పర్యటన - అప్రకటిత బంద్ - ప్రజలు, ప్రయాణికుల ఇక్కట్లు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 14, 2023, 7:19 PM IST
Local Faced Many Problems During CM Jagan Visit: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏ జిల్లాలో పర్యటించినా ఆ ప్రాంత ప్రజలుతీవ్ర అవస్థలకు గురికావాల్సిందే. సీఎం సభ పేరుతో అధికారులు అత్యుత్సాహం కనబరుస్తూ ఆంక్షలు విధిస్తారు, బస్సులను తరలించేస్తారు, దుకాణాలు మూయించేసి స్థానికులను నానా ఇబ్బందులకు గురి చేస్తారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా పలాసలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.
Bus Passengers Fire on CM Jagan: శ్రీకాకుళం జిల్లా పలాసలో ముఖ్యమంత్రి జగన్ గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం సభకు వెళ్లే దారి పొడవునా పోలీసులు ఆంక్షలు విధించారు. దీంతోపాటు వ్యాపారాలు జరగకుండా దుకాణాలను మూయించేశారు. మరోవైపు సభ కోసం ఆర్టీసీ బస్సులను తరలించడంతో బస్టాండ్‌లో బస్సులు లేక, ప్రయాణికులు అవస్థలు పడ్డారు. అంతేకాకుండా, దాదాపు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంబేడ్కర్ విశ్వవిద్యాలయంతో పాటు, ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్థులను సీఎం సభకు తరలించడం హాట్ టాపిక్‌గా మారింది.
Mohana Rao comments: ''నా పేరు మోహనరావు, మాది విశాఖపట్నం జిల్లా. పలాస ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహించేవాడిని. 2020లో ప్రమాదవశాత్తు బస్సు ఢీకొనడంతో నా రెండు కాళ్లు విరిగాయి. మూడేళ్లుగా ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నాను. ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా రాలేదు. ఈరోజు నా సమస్యను ముఖ్యమంత్రికి విన్నవించుకుందామని వస్తే కుదరదు అని పోలీసులు చెప్పారు.'' అని దివ్యాంగుడు ఆవేదన చెందారు.