డిసెంబరు 31న ఏపీలో రూ. 156.60 కోట్ల మద్యం హాంఫట్! అబ్కారీ శాఖ ఖుషి ఖుషి - ap district news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 1, 2024, 8:15 PM IST
High Volume of Alcohol Sold : నూతన సంవత్సరం రోజున రాష్ట్రంలో మద్యం ఏరులై పారింది. మందుబాబులు హద్దు అదుపు లేకుండా తెగ త్రాగేశారు. రికార్డు స్థాయి అమ్మకాలతో ఈ ఒక్క రోజే రాష్ట్ర ఖాజాన భారీగానే ఆదాయం సమకూరింది. ఒక్కరోజులోనే వందల కోట్ల రూపాయల విలువ గల మద్యాన్ని విక్రయాలు జరగడంతో రాష్ట్రప్రభుత్వం ఉబ్బితబ్బిబ్బు అవుతోంది. డిసెంబరు 31 ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 156.60 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగినట్లు గణాంకాలు తెలుపుతున్నాయి.
Increased Government Revenue From Liquor Sales : ఏపీ బెవరేజెస్ కార్పోరేషన్‌కు చెందిన మద్యం అవుట్ లెట్లు, బార్లు, తాత్కాలిక మద్యం విక్రయాల అనుమతులు తదితర మార్గాల ద్వారా మొత్తం ఒక్కరోజులోనే 156.60 కోట్ల రూపాయలు మేర విక్రయాలు జరిగినట్లు ఆబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు. 1.51 లక్షల కేసులు దేశీయంగా తయారైన విదేశీ మద్యం రకం , స్వదేశీ మద్యం 67 వేల కేసుల బీర్లు కూడా ఏపీ బెవరేజెస్ కార్పోరేషన్ విక్రయించింది. మందుబాబులు తమ ఆరోగ్యాన్ని, జేబులను గుల్లచేసుకొని ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చినట్లు ఈ గణంకాలు వెల్లడిస్తున్నాయి.