Leopard Died Hit by Train : రైలు ఢీకొని చిరుత మృతి.. సమీప ప్రాంతంలో మరో రెండు.. భయాందోళనలో ప్రజలు - అనంతపురంలో రైలు ఢీకొని చిరుతపులి మృతి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 19, 2023, 1:02 PM IST
Leopard Died After Being Hit by a Train : రైలు ఢీకొని చిరుత పులి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన శ్రీ సత్య సాయి జిల్లా బత్తలపల్లి మండలం డి.చెర్లోపల్లి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. తెల్లవారుజామున రామానుజంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో మూడు చిరుత పులులు రైలు పట్టాలు దాటుతుండగా.. తిరుపతి వెళుతున్న రైలు ఢీకొట్టడంతో ఒక చిరుత అక్కడికక్కడే చనిపోయింది. మరో రెండు చిరుతలు తప్పించుకున్నాయి.
Male Leopard Found Dead on Ramanujam Palli Railway Track : రైలు పట్టాలపై పడి ఉన్న చిరుత కళేబరాన్ని గ్రామస్థులు గమనించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలానికి చేరుకొని చిరుత కళేబరాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం సమీపంలో దహనం చేశారు. ఈ ప్రమాదంలో మగ చిరుత మృతి చెందిందని.. అది 60 కేజీల బరువు, సుమారు రెండు సంవత్సరాల వయస్సు ఉంటుందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. మరో రెండు చిరుతలు సమీప గ్రామాల పొలాల్లో తిరుగుతుండటంతో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు.