Land Irregularities With Kadapa District Collector Signature : పులివెందుల భూ కుంభకోణం కేసులో అరెస్టులు.. - Pulivendula Latest News
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 27, 2023, 10:16 AM IST
Land Irregularities With Kadapa District Collector Signature : వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో.. కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన VRO, ఇద్దరు సర్వేర్లు, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కడప జిల్లా పులివెందుల పరిధిలో ఉన్న డికేటి, చుక్కల భూములను రిజిస్ట్రర్ చేసేందుకు NOC కోసం కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి చేతివాటం ప్రదర్శించిన నిందితులను పులివెందుల పోలీసులు అరెస్ట్ చేశారు. కోట్లాది రూపాయలు విలువచేసే ప్రభుత్వ భూములకు NOC ఇప్పించేందుకు లక్షలాది రూపాయలను భూ యజమానుల వద్ద నుంచి నిందితులు వసూలు చేశారు. పులివెందుల రెవిన్యూ సిబ్బంది వీఆర్వో కలానంద రెడ్డి, పులివెందుల మండల సర్వేయర్ సందీప్ రెడ్డి, మున్సిపల్ సర్వేయర్ వాసుదేవ రెడ్డి, రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీనివాసులును పులివెందుల పోలీసులు అరెస్ట్ చేసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.. నిందితులను పులివెందులలోని కోర్టు సర్కిల్ వద్ద అరెస్టు చేసి రిమాండ్ కు పంపుతున్నట్లు పులివెందుల అర్బన్ సీఐ రాజు మీడియాకు వెల్లడించారు. దాదాపు 35 ఎకరాల భూములకు సంబంధించి జిల్లా కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీకి నిందితులు పాల్పడినట్లు బాధితుడు విద్యానంద రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజు వెల్లడించారు. భూ దందా విషయంలో ఇప్పుడు నలుగురిని అరెస్టు చేయడంతో.. స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.