దీపాల వెలుగుల్లో 'కార్తిక' జాతర - పురుషోత్తపట్నంలో కనుల పండువగా ఉత్సవం - కార్తికమాసం లక్ష దీపోత్సవం

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 24, 2023, 2:07 PM IST

Laksha Deepotsavam In East Godavari 2023 : తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నంలో లక్ష దీపోత్సవం కార్యక్రమం కన్నుల పండువగా సాగింది. కార్తిక మాసాన్ని పురస్కరించుకొని గ్రామంలోని రామాలయం నుంచి ఏటిగట్టుపై ఉన్న ఆంజనేయస్వామి ఆలయం వరకు మహిళలు దీపాలు వెలిగించారు. ఊరిలోని మహిళలు, పక్క గ్రామాల్లోని మహిళలు భారీగా తరలివచ్చిన ఈ దీపోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు జనం పెద్దఎత్తున తరలిరాగా గ్రామం జాతరను తలపించింది. దీపోత్సవం ఆద్యంతం నయనానందకరంగా సాగింది.

Karthika Masam Laksha Deepothsavam Special Poojalu In Ap : కార్తికమాసంలో జరుపుకొనే దీపోత్సవం వేడుకలు కావడంతో దీపారాధనలో పాల్గొనేందుకు మహిళలు ఉత్సాహం కనబరిచారు. కుటుంబ సమేతంగా పలువురు భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు. చుట్టు పక్కల గ్రామల వారంతా చేరి ఒకే చోట కనిపించడంతో పురుషోత్తపట్నంలో పండుగ వాతావరణం నెలకొంది. భక్తుల సందడితో ఆలయాలన్నీ కోలాహలంగా మారాయి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.