'బేరాల్లేక నష్టపోతున్నాం' - గాంధీ పార్కులో ఆటోవాలాల ఆందోళన
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 11, 2023, 5:10 PM IST
Labor Union Leaders Are Concerned : విశాఖ ఆర్కే బీచ్లో జీవీఎంసీ అధికారులు ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ ఆటోలను వెంటనే తొలగించాలని కార్మిక సంఘ నాయకులు గాంధీ పార్కులో ఆందోళన చేపట్టారు. ఆరు నెలల క్రితం అధికారులు 10 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలను తీర ప్రాంతం నుంచి సాగర్ నగర్ వరకు గర్భణులు, వికలాంగులు, వృద్ధులకు ఉచితంగా ఏర్పాటు చేశారని ఏఐటీయూసీ అధ్యక్షుడు షేక్ రహిమాన్ వెల్లడించారు.
Demand to Cancel Electric Autos : గర్భిణులు, వికలాంగులు, వృద్ధులకు ఎలక్ట్రిక్ ఆటోలను నడిపితే తమకు ఎటువంటి ఇబ్బంది లేదని, ఇందుకు విరుద్ధంగా బీచ్ సందర్శనకు వచ్చిన వారితో డబ్బులు వసూలు చేసున్నారని పేర్కొన్నారు. దీని వల్ల తమ ఆటోలకు బేరాలు లేక ఆర్థికంగా నష్టపోతున్నామని పేర్కొన్నారు. జీవీఎంసీ అధికారులు ఎలక్ట్రిక్ ఆటోలను రద్దు చేయాలని కోరుకున్నారు. లేని పక్షంలో డ్రైవర్లకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యను జీవీఎంసీ అధికారులు పరిష్కరించే వరకు ఆందోళనలు కొనసాాగిస్తామని సృష్టం చేశారు.