కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా - కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి హైకోర్టు ఆదేశం - Kollu Ravindra Anticipatory Bail Petition news

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 9, 2023, 1:44 PM IST

Kollu Ravindra Anticipatory Bail Petition Hearing on Postponed: మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర మద్యం కేసులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై గురువారం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు) విచారణ జరిపింది. విచారణలో భాగంగా న్యాయవాదుల వాదోపవాదనలు విన్న న్యాయస్థానం.. తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది. అనంతరం కౌంటర్‌ దాఖలు చేయాలని సీఐడీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. 

Kollu Ravindra Petition on Anticipatory Bail Grant: గత ప్రభుత్వ హయంలో మద్యం కంపెనీలకు అనుచిత లబ్ధి చేకూరేలా నిర్ణయం తీసుకున్నారన్న ఆరోపణలతో.. సీఐడీ అధికారులు తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ.. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత కొల్లు రవీంద్ర బుధవారం హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఆ పిటిషన్‌లో.. దురుద్దేశపూర్వకంగానే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం తమపై తప్పుడు కేసులు పెడుతోందని పేర్కొన్నారు. మద్యం నిర్ణయాలకు సంబంధించి కేబినెట్‌ ఆమోదం ఉందన్నారు. ప్రస్తుత ప్రభుత్వ మద్యం పాలసీ వల్ల చోటు చేసుకుంటున్న అవినీతిపై తాము గళమెత్తుతున్నందుకే తమపై తప్పుడు కేసు నమోదు చేసిందని పిటిషన్‌లో వివరించారు. ఆ వ్యాజ్యంపై నేడు విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.